English | Telugu
కాంతార చాప్టర్ 1 లో రిషబ్ శెట్టి భార్య, కొడుకు నటించిన రోల్స్ ఇవేనా!
Updated : Oct 9, 2025
రిషబ్ శెట్టి 'కాంతార'(Kantara)ని ఏ ముహూర్తాన స్టార్ట్ చేసాడో గాని, పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద బడా స్టార్ గా కూర్చోబెట్టింది. ఇప్పుడు ఆ స్టార్ డమ్ ని కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)రెట్టింపు చేస్తు రిషబ్ శెట్టి నుంచి తదుపరి చిత్రం ఎప్పుడు వస్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. చాప్టర్ 1 ఫస్ట్ వీక్ కే 400 కోట్ల క్లబ్ లో చేరడంతో, ఎండింగ్ కలెక్షన్స్ ఎక్కడ ఆగుతాయో తెలియని పరిస్థితి. ఇక చాప్టర్ 1 లో రిషబ్ శెట్టి భార్య ప్రగతి(Pragathi)కూడా నటించిందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో ఆమె ఏ క్యారక్టర్ లో కనపడిందనే చర్చ నెట్టింట జరుగుతుంది.
మూవీ ప్రారంభంలో రాజు తో ఒక సన్నివేశం ఉంటుంది. సదరు సన్నివేశంలో రాజు పక్కన పిల్లాడ్ని ఎత్తుకొని ఒక మహిళ నిలబడి ఉంటుంది. ఆ మహిళ రిషబ్ శెట్టి భార్య ప్రగతి నే. అదే విధంగా థియేటర్ లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న రధంకి సంబంధించిన సన్నివేశంలోను ప్రగతి తన కొడుకుని ఎత్తుకొని కనపడుతుంది. కాకపోతే కెమెరా ప్రత్యేకంగా ఈ ఇద్దరిని ఫోకస్ చేయదు. జస్ట్ ఒక రెండు సెకన్లు మాత్రమే కెమెరా వాళ్ళని చూపిస్తూ వెళ్తుంది.
ఇక ప్రగతి తెర వెనుక కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసారు. దీంతో ఇప్పుడు ఆమెకి మంచి పేరు వస్తుంది. మట్టి బట్టల నుంచి పౌరాణిక స్వరాన్ని నిర్వహించే రాచరికపు డిజైన్స్ వరకు ప్రతి ఫ్రేమ్ కు కావాల్సిన విధంగా అద్భుతంగా డిజైన్ చేశారు. కాంతార కి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.