English | Telugu

విజయ్‌ ఇంట్లో బాంబు.. మొదలైన పోలీసుల వేట!

దళపతి విజయ్‌కి తమిళనాట ఎంత ఫాలోయింగ్‌ వుందో అందరికీ తెలిసిందే. రజినీకాంత్‌ తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న హీరో విజయ్‌. ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించారు విజయ్‌. ‘తమిళగ వెట్రి కళగం’(టివికె) పేరుతో ఓ పార్టీని స్థాపించి రాబోయే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజల్లోకి వెళ్లి వారిని కలుసుకునేందుకు ఓ ర్యాలీ నిర్వహించారు విజయ్‌. సెప్టెంబర్‌ 27న కరూర్‌లో జరిగిన ఈ ర్యాలీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. కరూర్‌ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు చాలా మందిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ టీవీకే పార్టీ కరూర్‌ పశ్చిమ జిల్లా మథియాళన్‌, కార్యకర్త పౌన్‌రాజ్‌, యూట్యూబర్‌ ఫెలిక్స్‌ జెరాల్డ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కరూర్‌ ఘటనపై పలువురు తమ నిరసనను వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నేతలు కూడా జరిగిన ఘటనపై వ్యాఖ్యానాలు చేశారు. ఇదిలా ఉంటే.. విజయ్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. డయల్‌ 100కి కాల్‌ చేసిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ‘మరోసారి విజయ్‌ పబ్లిక్‌ మీటింగ్‌ పెడితే.. వాళ్ళ ఇంట్లో బాంబు పెడతాను’ అని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చెన్నయ్‌లోని విజయ్‌ ఇంటి దగ్గర భద్రత మరింత పెంచారు. కాల్‌ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి అతని లొకేషన్‌ను ట్రేస్‌ చేస్తున్నారు. 100కి వచ్చిన ఈ కాల్‌ గురించి తెలుసుకొని విజయ్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు మాత్రం నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం