English | Telugu

దండపాణి బాబా ఆలయంలో రేణు దేశాయ్ ఏం చేశారంటే...

రేణు దేశాయ్ ఏది చేసిన అందులో ఒక అర్ధం పరమార్ధం ఉంటుంది. అంటే ఎవరో చూస్తున్నారనో ఆమె ఏ పని చేయరు. ఆమెకు ఏదనిపిస్తే అదే చేస్తారు. రీసెంట్ గా ఆమె కాశీ పుణ్య క్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఆమెకు ఎంతో ఇష్టమైన దండపాణి బాబా ఆలయంలో చెత్తను శుభ్రం చేశారు. ఐతే ఎవరో ఒక వ్యక్తి దాన్ని వీడియో తీశారు. "నేనెప్పుడూ ఆలయానికి ఒంటరిగా వెళ్లి అక్కడ ఏదో ఒక సేవ చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడూ వీడియో తీసుకోలేదు. ఐతే ఈసారి ఒకామె నాతో ఉండి వీడియో తీశారు. ఈ వీడియో ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుందని అప్పుడు టెంపుల్స్ ని క్లీన్ చేసే దిశగా సమాయత్తం అవుతారని చెప్పారు" అంటూ రేణు దేశాయ్ ఆ వీడియో దగ్గర ఈ వాక్యాలను పోస్ట్ చేశారు. " నాకు రెండవ ఇష్టమైన దండపాణి బాబా ఆలయంలో (మొదటి ఇష్టమైనది కాలభైరవుడు) సేవ చేస్తున్నప్పుడు వీడియో తీయడం వింతగా అనిపించింది.

కానీ ఈ వీడియో మీకు స్ఫూర్తినిస్తుందని అనిపించింది. అందుకే మీరు సిగ్గుపడటం మానేసి మీ ఇంటి చుట్టూ ఉన్న దేవాలయాలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాలని నేను ఆశిస్తున్నాను. నేను హైదరాబాద్‌లో కూడా దీన్ని చేయాలనుకుంటున్నాను కానీ ఇక్కడ చేస్తున్నంత హాయిగా చేయడం నాకు సులభం కాదు..కాబట్టి మన ఆలయాలను మనమే శుభ్రం చేసుకోవాలి..హర్ హర్ మహాదేవ్ " అని చెప్పారు రేణు దేశాయ్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .