English | Telugu
టాలీవుడ్ నిర్మాత ఆత్మహత్య.. అసలేం జరిగింది?
Updated : Nov 10, 2023
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత సాతులూరి వేణుగోపాల్ కన్నుమూశారు. ఆర్ధిక సమస్యల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరుగుతుండగా.. ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడి మరణించారని సన్నిహితులు చెబుతున్నారు.
'ఆనందోబ్రహ్మ', 'తోడికోడళ్లు', 'తులసీదళం' వంటి పదికి పైగా సీరియల్స్ ని సాతులూరి వేణుగోపాల్ నిర్మించారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'నక్షత్రం' సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. బుల్లితెరపైనా, వెండితెరపైనా తనదైన ముద్ర వేసిన వేణుగోపాల్ ఆకస్మిక మృతితో పరిశ్రమలో విషాదం నెలకొంది. మరోవైపు ఆయన ఆత్మహత్య చేసుకున్నారని జరుగుతున్న ప్రచారంపై 'నక్షత్రం' నిర్మాతల్లో ఒకరైన సజ్జు స్పందించారు. వేణుగోపాల్ మహబూబ్ నగర్ వెళ్తూ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించారని తెలిపారు.