English | Telugu
ఈ దీపావళికి విజయ్ దేవరకొండ వస్తున్నాడా?
Updated : Nov 10, 2023
విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నయా క్రేజీ మూవీ ఫ్యామిలీ స్టార్. అసలు మేకర్స్ ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ అనౌన్స్ చెయ్యగానే విజయ్ అభిమానుల్లోను సినిమా అభిమానుల్లోను ఫ్యామిలీ స్టార్ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించినా తాజా వార్త విజయ్ అభిమానుల్లో ఆనందాన్ని తీసుకొచ్చింది.
ఇటీవల రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ నుండి అతి త్వరలో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. అలాగే ఆ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందో అనే అప్ డేట్ ని కూడా చిత్ర బృందం ఈ దీపావళికి అనౌన్స్ చేస్తుందనే టాక్ కూడా ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది.
విజయ్ దేవరకొండ, పరశురామ్ ల కాంబినేషన్ లో ఇంతకు ముందుకు వచ్చిన గీత గోవిందం మూవీ ఎంత సక్సెస్ అయ్యిందో అందరి తెలిసిందే. ఆ మూవీ సంచలన వసూళ్లతో ఎన్నో రికార్డులని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని విజయ్ అభిమానులు చాలా గట్టిగానే నమ్ముతున్నారు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చెయ్యబోతున్నాడు.