English | Telugu
రవితేజ ‘బెంగాల్ టైగర్’.. మరి తమన్నా?
Updated : Jan 30, 2015
రవితేజ, తమన్నా జంటగా నటిస్తుండగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘బెంగాల్ టైగర్’ సినిమా షూటింగ్ శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. రవితేజ, తమన్నాలపై చిత్రీకరించిన ముహూర్త సన్నివేశానికి రవితేజ క్లాప్ ఇచ్చారు. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, బొమన్ ఇరానీ ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాకి రకరకాల టైటిల్స్ అనుకుని చివరికి ‘బెంగాల్ టైగర్’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ సినిమాలో రవితేజ బెంగాల్ టైగర్ అంటే ఆయన కేరెక్టర్ ఎలా వుంటుందో ఒక ఐడియా అయితే వస్తోంది. మరి తమన్నా కేరెక్టర్ ఎలా వుంటుందో...!