English | Telugu

‘బాహుబలి’ లీక్... రాజమౌళి కేస్...

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడా.. ఇంకెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బాహుబలి’ సినిమా విడుదలైంది. కాకపోతే థియేటర్లలో కాదు... ఇంటర్నెట్‌లో! ‘బాహుబలి’ సినిమాకి సంబంధించిన 13 నిమిషాల ఫుటేజ్ ఈమధ్య యూట్యూబ్‌, ఫేస్‌బుక్, వాట్సప్‌లో విడుదలైంది. మూడు రోజులుగా ఈ ఫుటేజ్ నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకి పనిచేసిన సిబ్బంది ఎవరో ఈ ఫుటేజ్‌ని లీక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడు రాజమౌళి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ సిబ్బంది మీదే అనుమానాలు వున్నాయని ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ఆ సినిమాకి పనిచేసిన సిబ్బంది పదిమందిని పోలీసులు విచారించారు. ‘బాహుబలి’ ఫుటేజ్ ఎడిటింగ్ చేసినదే లీక్ అయింది. కాబట్టి అది ఎడిట్ సూట్ నుంచే బయటకి వచ్చిందన్న అనుమానాలున్నాయి. బయటకు రావాలి. దాంతోఎడిట్ సూట్లో ఉన్నవారిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.