English | Telugu

ఛార్మి న‌డుంపై చెయ్యి పడింది...

సినీ తార‌ల‌కు, అందునా క‌థానాయిక‌ల‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింది. జ‌నంలోకి వెళ్లాలంటే భ‌యం.. భ‌యం. ఆక‌తాయిలు. అల్ల‌రి పోర‌గాళ్లు ఏం చేస్తారోన‌ని. జ‌నంలోకి వెళ్తే.. సెఫ్టీగా తిరిగివ‌స్తామ‌ని న‌మ్మ‌కం లేదు. ఛార్మికీ ఇలాంటి అనుభ‌వం ఎదురైంది. `ఛార్మీ మేడ‌మ్ నాతో ఓ ఫొటో..` అని అని అభ్య‌ర్థించిన అభిమాని కోరిక తీర్చ‌బోయి.. షాక్ తింది. అస‌లింత‌కీ ఏం జ‌రిగిందంటే.. సీసీఎల్‌, హృద‌య ఫాండేష‌న్ సంయుక్తంగా హైద‌రాబాద్‌లోని ఎన్ క‌న్వెన్ష‌న్‌లో ఓ పార్టీ జ‌రిగింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తార‌లంతా హాజ‌ర‌య్యారు. ఛార్మి కూడా వ‌చ్చింది. రెడ్ కార్పెట్ ద‌గ్గ‌ర ఫొటోల‌కు పోజిస్తుంటే ఓ అభిమాని ఛార్మితో ఫొటో తీయించుకోవ‌డానికి అంద‌ర్నీ తోసుకొంటూ వ‌చ్చాడు. ఛార్మి అత‌నితో ఫొటో దిగ‌డానికి ఒప్పుకొంది. అయితే.. అదును చూసుకొని ఛార్మి న‌డుంపై చేయేసి, ద‌గ్గ‌రికి లాక్కున్నాడా ఫ్యాన్‌. దాంతో చార్మి కంగారు ప‌డింది. ప‌క్క‌నున్న ఛార్మి మేనేజ‌ర్ ఆ ఆక‌తాయిని ప‌క్క‌కు లాగి, ఒక్క‌టిచ్చాడు. దాంతో అక్క‌డ కాస్త క‌ల‌క‌లం మొద‌లైంది. చివ‌రికి బౌన్స‌ర్స్ రావ‌డంతో ఆ అబ్బాయి అక్క‌డి నుంచి తుర్రుమ‌న్నాడు. అదేం పైచాచిక ఆనంద‌మో ఏమో..? మొత్తానికి పార్టీకి వ‌చ్చిన‌ఛార్మి మూడంతా పాడైంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.