English | Telugu
అమ్మాయి కోసం రోడ్డు మీద గొడవ పడిన హీరో నాగ శౌర్య!
Updated : Feb 28, 2023
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య నడిరోడ్డు మీద ఓ యువకుడితో గొడవ పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువకుడు ఒక యువతిని కొట్టడం చూసి ఆగ్రహం తెచ్చుకున్న నాగ శౌర్య.. ఆ అమ్మాయికి సారీ చెప్పాలంటూ పట్టుబట్టాడు. ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి యువకుడు అక్కడి నుంచి వెళ్లబోతుండగా.. అతణ్ణి చెయ్యి పట్టి లాగిన నాగ శౌర్య 'గర్ల్ ఫ్రెండ్ అయితే ఇలా కొడతావా' అంటూ నిలదీసి సారీ చెప్పేవరకు వదల్లేదు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరో తెలియని యువతి కోసం.. నడిరోడ్డు మీద యువకుడిని నిలదీసి సారీ చెప్పించిన నాగ శౌర్య తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది. మరోవైపు అసలు ఇది నిజంగా జరిగిందా? లేక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తీసిన వీడియోనా? లేదా ఏదైనా మూవీ షూటింగా? అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే నాగ శౌర్య హీరోగా నటించిన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమా మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది.