English | Telugu
బాలయ్య సాక్షిగా.. విజయ్-రష్మిక లవ్ స్టోరీ రివీల్!
Updated : Nov 16, 2023
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిసున్న అన్ స్టాపబుల్ షోలో 'యానిమల్' మూవీ టీం పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్ త్వరలోనే ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ ఎపిసోడ్ లో ఒక సర్ ప్రైజ్ ఉందట.
అన్ స్టాపబుల్ షోలో యానిమల్ మూవీ హీరోహీరోయిన్లు రణబీర్ కపూర్, రష్మిక మందన్నతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నాడు. అయితే ఈ ఎపిసోడ్ లో ఫోన్ ద్వారా విజయ్ దేవరకొండ ఆ మూవీ టీంతో ముచ్చడించాడట. సందీప్ రెడ్డి, రష్మికతో విజయ్ కి మంచి అనుబంధముంది. తనకి ఓవర్ నైట్ స్టార్డం తీసుకొచ్చిన 'అర్జున్ రెడ్డి'కి సందీపే దర్శకుడు. ఇక రష్మికతో 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు విజయ్. పైగా వీరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. ఇటీవల వారి చర్యలు ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విజయ్-రష్మిక సీక్రెట్ గా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. అలాగే రష్మిక దీపావళిని సీక్రెట్ గా విజయ్ ఇంట్లో సెలెబ్రేట్ చేసుకుంది. ఆ విషయాన్ని రష్మిక రివీల్ చేయనప్పటికీ.. ఆమె షేర్ చేసిన ఫొటోలో అది విజయ్ ఇల్లు అని అందరికీ అర్థమైంది. ఇలా విజయ్-రష్మిక ప్రేమ వార్తలు రోజురోజుకీ బలపడుతున్నాయి.
అసలే బాలయ్య అన్ స్టాపబుల్ కి వచ్చిన గెస్ట్ లతో చాలా సరదాగా ఉంటాడు. అలాంటిది షోలో రష్మిక ఉన్న సమయంలో.. విజయ్ ఫోన్ కాల్ లోకి వస్తే.. లవ్ టాపిక్ తీసుకొచ్చి ఆడుకోకుండా ఉంటాడా!. "ఏంటమ్మా ఏంటి మీ ప్రేమ కథ" అంటూ సరదాగా అడుగుతూనే మొత్తం మేటర్ లాగేస్తాడు. అందుకే బాలయ్య సాక్షిగా విజయ్, రష్మిక ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారు? వారి ప్రేమ వార్తల గురించి బాలయ్య ఎలాంటి సమాచారం లాగాడు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
మరోవైపు పైకి తాము ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ, విజయ్-రష్మిక లవ్ లో ఉన్నారని త్వరలోనే ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. మరి ఆ వార్తలను నిజం చేస్తూ ఈ జంట.. బాలయ్య ముందు వారి లవ్ స్టోరీని రివీల్ చేస్తారేమో చూడాలి. విజయ్, రష్మిక అభిమానులు సైతం వారి ప్రేమ గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బాలయ్య సాక్షిగా వారి లవ్ రివీల్ అయితే ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.