English | Telugu
ఇక్కడ రష్మిక... అక్కడ జాన్వీ... సేమ్ టు సేమ్!
Updated : Feb 14, 2023
రష్మికకు, జాన్వీ కపూర్‌కి అసలు ఎక్కడ పొంత కుదురుతుంది. రష్మిక ఇండస్ట్రీకి ఔట్ సైడర్. స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నారు. జాన్వీ ఇండస్ట్రీ కిడ్. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. చిన్నప్పటి నుంచీ ఫ్లడ్ లైట్స్ మధ్య పెరిగింది... అలాంటప్పుడు ఇద్దరికీ అసలు పోలిక ఎక్కడ అనే ఆలోచన చాలా మందికి వచ్చేస్తుంది.ఈ ఇద్దరి బ్యాక్‌గ్రౌండ్లు వేరైనా, ఇద్దరి అలవాట్లలో మాత్రం కామన్ పాయింట్లు వెతుకుతున్నారు జనాలు.రష్మిక నిద్ర లేస్తే జిమ్‌లో కనిపిస్తుంది. శరీరాన్ని తగ్గించుకోవడానికే కాదు, అవసరమైన శరీరాకృతిని పొందడానికి కూడా వర్కవుట్లు ఉపయోగపడుతాయని ప్రాక్టికల్‌గా నిరూపించిన నటి రష్మిక. అంతే కాదు, పార్టీలకు, ఫంక్షన్లకు అల్ట్రా గ్లామరస్‌గా రెడీ అవుతారు రష్మిక. స్టెప్ బై స్టెప్ తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు.అటు జాన్వీ కూడా ఫిట్‌నెస్ ఫ్రీక్. రకరకాల కాస్ట్యూమ్స్ తో జిమ్‌ని హిట్ చేస్తుంటారు జాన్వీ కపూర్. పార్టీలకు, ఫంక్షన్లకు అల్ట్రా గ్లామరస్‌గా వెళ్తుంటారు.
మొన్నమొన్నటిదాకా నార్త్ సినిమాలు చేసిన ఈమె త్వరలోనే సౌత్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. డ్యాన్సుల్లోనూ ది బెస్ట్ అనిపించుకుంటున్నారు.ఈ కామన్ పాయింట్స్ తో పాటు మరో పెక్యులియర్ పాయింట్‌ని గురించి కూడా చెబుతున్నారు విశ్లేషకులు.అటు జాన్వీ, ఇటు రష్మిక నెటిజన్ల కామెంట్లకు తీవ్రంగా హర్ట్ అవుతారన్నది ఆ పాయింట్.ఐదు మెట్రో పాలిటన్ సిటీల్లో రష్మికకు ఇళ్లు ఉన్నాయన్నది ఆ మధ్య గట్టిగా వినిపించిన మాట. అసలు అలాంటివి లేవు. అయినా మీరందరూ అలాగే కోరుకోండి, నేను కూడా కొనేస్తా అని వ్యంగ్యంగా అన్నారు రష్మిక. నెటిజన్లు ఉన్నవీ లేనివీ ఇలా ఎందుకు కల్పించుకుని మాట్లాడుతారని బాధపడ్డారు.ఇప్పుడు జాన్వీ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఇలాంటి మాటలే మాట్లాడారు. నెపోటిజమ్‌తో స్టార్టింగ్‌లో తనను ట్రోల్ చేశారని, ఇప్పుడు తనకు నటన రాదని ట్రోల్ చేస్తున్నారని బాధపడుతున్నారు జాన్వీ. తన సినిమాలను గమనిస్తే, స్టెప్ బై స్టెప్ తన యాక్టింగ్ స్కిల్స్ మెరుగుపడటాన్ని గమనించవచ్చని అంటున్నారు జాన్వీ.