English | Telugu

కుంభ‌కోణంలో న‌య‌న్ - విఘ్నేష్ స్పెష‌ల్ పూజ‌లు

త‌మ త‌న‌యుల ముఖాల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన సంద‌ర్భంగా కుంభ‌కోణం ఆల‌యంలో త‌లైవి న‌య‌న‌తార‌, ఆమె భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ప్ర‌త్యేక పూజ‌ల‌ను నిర్వ‌హించారు. బుధ‌వారం తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఫ్లాష్ అయ్యారు న‌య‌నతార, ఆమె భర్త విఘ్నేష్ శివ‌న్‌. కుంభ‌కోణంలోని ఫేమ‌స్ ఆల‌యానికి కారులో వెళ్లారు. ఈ ట్రిప్‌లో వాళ్లిద్ద‌రూ త‌మ పిల్ల‌ల‌ను వెంట‌బెట్టుకుని వెళ్ల‌లేదు. ఉత్త‌ర న‌క్షత్రాన్ని పుర‌స్క‌రించుకుని ఆల‌యంలో స్పెష‌ల్‌గా పూజ‌లు చేశారు. వారిద్ద‌రూ ఆల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. విఘ్నేష్ శివ‌న్ ప్యాంట్, బ్లూ ష‌ర్ట్, వైట్ జాకెట్ ధ‌రించారు. న‌య‌న‌తార చుడిదార్‌లో ఫ్లాష్ అయ్యారు.

గ‌తేడాది పెళ్లికి ముందు ఈ దంప‌తులు విఘ్నేష్ పూర్వీకుల ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల‌ను నిర్వ‌హించారు. ఉయిర్ రుద్రో నీల్ ఎన్ శివ‌న్‌, ఉల‌గ్ దైవిక్ ఎన్ శివ‌న్ అని త‌మ ఇద్ద‌రి కొడుకుల పేర్ల‌ను ఇటీవ‌ల చెప్పారు విఘ్నేష్ శివ‌న్‌. పిల్ల‌ల పేర్ల‌లో ఎన్ అంటే న‌య‌న‌తార అని, శివ‌న్ అంటే త‌న పేరు అని కూడా వివ‌రించారు విఘ్నేష్‌. న‌య‌న‌తార న‌టించిన క‌నెక్ట్ ఇటీవ‌ల విడుదలైంది. ఆమె ప్ర‌స్తుతం షారుఖ్ ఖాన్ స‌ర‌స‌న జ‌వాన్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. విఘ్నేష్ శివ‌న్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అన్నీ ప‌ర్ఫెక్ట్ గా జ‌రిగి ఉంటే, ఈ పాటికి అజిత్ హీరోగా విఘ్నేష్ శివ‌న్ డైర‌క్ష‌న్‌లో సినిమా మొద‌లై ఉండేది. మ‌రోవైపు విఘ్నేష్‌, న‌య‌న‌తార క‌లిసి రౌడీ పిక్చ‌ర్స్ ప‌తాకంపై గుజ‌రాతీ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రొఫెష‌న‌ల్‌గా ఎవ‌రు ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, విఘ్నేష్ - న‌య‌న్ సంప్ర‌దాయాల‌ను నిర్వ‌ర్తించ‌డంలో ఎప్పుడూ ముందుంటున్నారు. ముఖ్యంగా ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తున్న స్టార్ క‌పుల్‌గా వీరిద్ద‌రికీ మంచి పాపులారిటీ ఉంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.