English | Telugu
టాలీవుడ్ యువత ధైర్యం
Updated : Jul 17, 2011
టాలీవుడ్ యువత ధైర్యం బాగా పెరిగిందని ఈ మధ్య జరుగుతున్న సంఘటనలను చూస్తే అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే ఆ మధ్య దర్శకరత్న, డాక్టర్ దాసరి నారాయణరావు ఒక సందర్భమలో హీరోయిన్లు తాము నటించిన సినీ ఫంక్షన్లకు రాకపోవటం శోచనీయమన్నారు. దానికి ప్రతిగా యువ హీరో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ "నేను చాలా ఫంక్షన్లకు వెళ్ళాను. ఆ యా ఫంక్షన్లకు చాలా మంది హీరోయిన్లు వచ్చారు. దాసరి గారు పొరపాటు పడి ఉంటారు" అని అన్నాడు.
తర్వాత మొన్న యస్.వి.రంగారావు స్మారక అవార్డునందుకున్న సందర్భంలో "నేటి యువ హీరోలకు నటన రాద"ని దాసరి అన్నారు. దానికి ప్రతిగా రామ్ చరణ్ "నేడు గ్రేట్ డైరెక్టర్లమని చెప్పుకునే సీనియర్ డైరెక్టర్లు ఒక సినిమాని తీసి హిట్ చేయమనండి చూద్దాం. వాళ్ళు తమ శరీరంలో కదిలించ గలిగేది ఒక్క నోరు మాత్రమే"అని అన్నాడు.
అలాగే నిత్య మీనన్ "నాకు ఓ మై ఫ్రెండ్ చిత్రంలో వేషం రాకపోవటానికి కారణం హీరో సిద్ధార్థే"నని కుండబ్రద్ధలు కొట్టింది. అలగే విలేఖరులడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా" హూ ఈజ్ ప్రభాస్...?" అంది.
అలాగే కాజల్ అగర్వాల్ కూడా "నన్ను సౌతిండియన్ అనకండి...నాది ముంబాయ్" అని అనటం కూడా వివాదాలకు దారి తీసింది. ఏది ఏమైనా నేటి తరం యువ నటీనటులు ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పటం బాగుంది.