English | Telugu

సినీ హీరో రవితేజ ఓదార్పు యాత్ర

సినీ హీరో రవితేజ ఓదార్పు యాత్ర ప్రారంభించాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి... సరిగ్గా గమనించి చూస్తే ఈ మాస్ రాజా రవితేజ చేస్తున్న సినిమాలు చూస్తుంటే అది నిజమేనేమోననిపిస్తుంది. వివరాల్లోకి వెళితేమాస్ రాజా రవితేజ ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో, వై.వి.యస్.చౌదరి నిర్మిస్తున్న"నిప్పు" చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. గుణ శేఖర్ పేరు చెపితే హీరోలంతా పారిపోతుంటే, అతను గతంలో తన రూమ్మేట్ కావం అనే ఒక కారణంతో అతనికి సినిమా చేయటం అంత వివేకవంతమైన చర్య కాకపోయినా, ఒక స్నేహితుడికి కష్టకాలంలో సాయం చేసేంత పెద్ద మనసు రవితేజదని అంతా అంటున్నారు.

అలాగే తనతో "షాక్" వంటి ఫ్లాప్ సినిమా తీసిన హరీష్ శంకర్ కి "మిరపకాయ్" సినిమానివ్వటం కూడా అంతేనని, అయితే ఇచ్చిన అవకాశాన్ని హరీష్ శంకర్ సద్వినియోగపరచుకున్నాడనేది మనకు తెలిసిందే.

అలాగే "రైడ్" రమేష్ వర్మకి "వీర" సినిమానిచ్చి ఫ్లాపుని తన ఖాతాలో జమ చేసుకోవాల్సి వచ్చింది.

ఇక "శక్తి" వంటి ఘోరమైన ఫ్లాపునిచ్చిన మెహెర్ రమేష్ కి మరో అవకాశమివ్వటానికి కూడా రవితేజ సిద్ధమవుతున్నాడట. ఈ విధంగా రవితేజ ఫ్లాప్ దర్శకులందరికీ ఓదార్పు యాత్రను ప్రారంభించాడని చెప్పవచ్చు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.