English | Telugu
'లియో'లో 'కోబ్రా'గా రామ్ చరణ్?
Updated : Oct 13, 2023
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ మూవీ 'లియో'లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో సందడి చేయనున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా 'లియో'లో 'కోబ్రా' అనే పాత్రలో చరణ్ కనిపించనున్నట్లు ఒక పోస్టర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో నిజంగానే లియోలో చరణ్ నటించాడని కొందరు నమ్మారు. కానీ అది నిజమైన పోస్టర్ కాదు, ఫేక్ పోస్టర్. ఎవరో ఆ పోస్టర్ ని కావాలని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు.
రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశముందని గతంలో లోకేష్ కనగరాజ్ చెప్పాడు. దాంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో చరణ్ మూవీ అంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే లియోలో ఆయన పాత్ర పరిచయం అవుతుందని కూడా ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు పోస్టర్ కూడా ప్రత్యక్షమవ్వడంలో చాలామంది అదే నిజమని నమ్మారు. కానీ ఆ పోస్టర్ నిజమైనది కాదు. ఫేక్ పోస్టర్. అలాగే లియోలో చరణ్ నటించాడనే వార్తల్లో కూడా ఏమాత్రం నిజం లేదని అంటున్నారు.