English | Telugu
ఆ విషయంపై రేణు దేశాయ్ కూడా క్లారిటీ ఇచ్చేసింది!
Updated : Oct 13, 2023
పవన్‌కల్యాణ్, రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అయినప్పటికీ వారి గురించి, వారి పిల్లల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. కొంతకాలం వీరి కుమారుడు అకీరానందన్ గురించి రకరకాల వార్తలు వినిపస్తున్నాయి. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, అతను హీరోగా వస్తే చూడాలని తాము కోరుకుంటున్నామని పవర్‌స్టార్ అభిమానుల పదే పదే పోస్టులు పెడుతున్నారు. రేణు దేశాయ్ మీడియా ముందుకు వస్తే చాలు.. మొదట అడిగే ప్రశ్న మీ అబ్బాయి సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడని. దీని గురించి అందరూ పదే పదే అడిగి తనను విసిగిస్తున్నారని రేణు దేశాయ్ చిరాకు పడిరది.
అయినా మరోసారి క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయిందో ఏమో... సందర్భంగా రాకపోయినా అకీరానందన్ గురించి క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా ఉంది. అందుకే అకీరా గురించి స్పందిస్తూ ‘‘మా అబ్బాయి సినిమా ఎంట్రీ గురించి చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను. అయినా మరోసారి క్లారిటీ ఇస్తున్నాను. తనకు సినిమాలంటే ఆసక్తి లేదు. తనది వేరే ప్రపంచం. అతను హీరోగా ఎంట్రీ ఇస్తానంటే మీ అందరికంటే ఒక తల్లిగా నేనే ఎక్కువ సంతోషిస్తాను. ఎందుకంటే నా కొడుకు హీరో అవుతున్నాడంటే నాకు గొప్ప విషయంగానే అనిపిస్తుంది కదా. ఈ విషయం గురించి అకీరాను చాలాసార్లు అడిగాను. దానికి వాడు ‘నో’ అనే సమాధానమే చెప్పాడు. ఫ్యూచర్‌లో ఈ విషయం గురించి ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? అని కూడా అడిగాను. దానికి ‘ఫ్యూచర్ గురించి ఇప్పుడే ఎలా చెప్పమంటావ్?’ అన్నాడు. అతనికి సినిమా కంటే మ్యూజిక్‌పైనే ఎక్కువ ఇంట్రెస్ట్. దాని తర్వాత యోగా, బాక్సింగ్, ప్రాణాయామం వంటి ఎక్కువ ఇష్టపడతాడు. ఫైనల్‌గా అతనికి సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చేసింది రేణు దేశాయ్.