English | Telugu

బాబు కోసం రంగంలోకి దిగిన రజినీకాంత్!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన అరెస్ట్ ని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాబు అరెస్ట్ అక్రమం అంటూ పలువురు జాతీయ నాయకులు కూడా స్పందించారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ నుంచి మాత్రం రాఘవేంద్రరావు, అశ్వినీదత్, మురళీమోహన్, నట్టి కుమార్ వంటి అతికొద్ది మందే స్పందించారు. ఈ విషయమై నట్టి కుమార్ టాలీవుడ్ తీరుని తప్పుబట్టారు కూడా. సినీ పరిశ్రమకు, సినిమా వారికి బాబు అండగా నిలిచారని.. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేస్తే.. రాజకీయంగా కాకపోయినా మానవత్వంతోనైనా స్పందించాలంటూ ఫైర్ అయ్యారు. అయితే టాలీవుడ్ తీరు ఇలా ఉంటే.. కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్, బాబుకి మద్దతు ప్రకటించడం విశేషం.

చంద్రబాబుకి, రజినీకాంత్ కి మంచి అనుబంధమున్న సంగతి తెలిసిందే. ఇద్దరు మంచి స్నేహితులు. అలాగే నాయకుడిగానూ బాబుని రజినీ ఎంతో ఇష్టపడతారు. ఆయన లాంటి ముందు చూపున్న నాయకుడిని గెలిపించుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రజినీ పబ్లిక్ వేదికలపై చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి తన స్నేహితుడు, ఇష్టమైన నాయకుడు అరెస్ట్ కావడంతో రజినీ ఎంతో ఆవేదన చెందారట. అంతేకాదు బాబు తనయుడు, యువ నాయకుడు నారా లోకేష్ కి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. "నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు. చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్ష. చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి. తప్పుడు కేసులు, అక్రమ కేసులు ఆయనను ఏమీ చేయలేవు. నా మిత్రుడు చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు. చేసిన మంచి పనులు, ప్రజాసేవ ఆయనను బయటకు తీసుకొస్తాయి" అంటూ లోకేష్ ధైర్యం చెప్పారట రజినీ.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.