English | Telugu
ఆరు రోజుల్లో రూ. 600 కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో జవాన్ కి ఇక లాభమే!
Updated : Sep 13, 2023
కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తాజా చిత్రం 'జవాన్'.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మంగళవారం వచ్చిన కలెక్షన్లతో ఈ సినిమా రూ. 600 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా లాభాల బాట పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన 'జవాన్'.. 6వ రోజైన మంగళవారం నాటికి రూ. 19.30 కోట్ల షేర్ చూసింది. దీంతో.. 'జవాన్' ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైనట్లయ్యింది.
ఇక ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 39. 15 కోట్ల గ్రాస్ చూసింది. సోమవారంతో పోలిస్తే మంగళవారం వసూళ్ళు రూ. 15 కోట్లకు పైగా తగ్గాయి. మొత్తంగా.. ఆరు రోజుల్లో 'జవాన్' రూ. 614. 60 కోట్ల గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఏరియాల వారిగా 'జవాన్' 6 రోజుల కలెక్షన్స్ వివరాలు:
తెలుగు రాష్ట్రాలు: రూ.38.85 కోట్ల గ్రాస్
తమిళనాడు : రూ.31.75 కోట్ల గ్రాస్
కర్ణాటక: రూ. 32.45 కోట్ల గ్రాస్
కేరళ: రూ. 10.75 కోట్ల గ్రాస్
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 301. 05 కోట్ల గ్రాస్
ఓవర్సీస్: రూ.199.75 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల కలెక్షన్స్ : రూ.614.60 కోట్ల గ్రాస్
హిందీ వెర్షన్ 6 రోజుల నెట్: రూ. 306. 58 కోట్లు