English | Telugu
మలేషియా ప్రధాని రజనీకాంత్ గుండు కామెడీ!
Updated : Sep 12, 2023
సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఇక్కడే కాదు ప్రపంచం యావత్తు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. జపాన్, మలేషియా, సింగపూర్, అమెరికా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టే చాటంత అవుతుంది. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు సైతం తలైవర్‌కి అభిమానులు కావటమే ఇక్కడి విశేషం. ఇప్పుడు అందుకు మరో ఉదాహరణ దొరికింది. వివరాల్లోకి వెళితే రీసెంట్‌గా రజినీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంను కలిశారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. రజినీకాంత్ ఎప్పటిలాగానే సింపుల్‌గా కనిపిస్తున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మాత్రం రజినీను చూడగానే ఆనందం పట్టలేకపోయారు. శివాజీ సినిమలో గుండుతో ఉన్నప్పుడు బాస్ గుండు బాస్ అంటూ రజినీ చేసే స్టైల్‌ను ఆయన ఇమిటేట్ చేశారు.
మలేషియా ప్రధాని అలా చేయటం చూసి రజినీకాంత్ ఆనందంతో నవ్వేశారు. ఆనంతరం వీరు ఆప్యాయంగా కలుసుకుని మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అన్వర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఏషియాతో పాటు ప్రపంచంలోనే గొప్ప యాక్టర్‌ను కలిశాను. ప్రజల కష్ట, నష్టాల్లో నేను అందించిన సేవలపై రజినీకాంత్ స్పందించిన తీరు, గౌరవంపై అభినందిస్తున్నాను. అలాగే ఆయన తదుపరి తీయబోతున్న సినిమాల్లోనూ సామాజిక అంశాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఆయన ఎంచుకునే ప్రతీ రంగంలోనూ రాణించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు అన్వర్.
రీసెంట్‌గా జైలర్ సినిమాతో రజినీకాంత్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు. ఆ సినిమా రూ.650 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టుకుంది. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఆయన తన 170వ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జై భీమ్ ఫేమ్ టి.జి.జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.