English | Telugu
మహేష్‌కి విలన్‌గా హాలీవుడ్ నటుడు!
Updated : Feb 10, 2023
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 28 అనే సినిమా చేస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత మహేష్ కాల్ షీట్ లన్ని రాజమౌళికి ఇచ్చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత మహేష్ బాబుతో రాజమౌళి చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందట. భారీ బడ్జెట్‌తో ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి సరికొత్త కథాశంతో రాజమౌళి రెడీ అవుతున్నారు. సౌత్ ఆఫ్రికా లోని అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉంటుంది. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్గా మహేష్ పాత్ర ఉంటుంది. దీంతో సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెరిగిపోయాయి క్యాస్టింగ్ కోసం హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీ తో జక్కన్న ఒప్పందం చేసుకున్నారు.
దాంతో ఈ చిత్రంలో హాలీవుడ్ నటులు ఎక్కువగా ఉంటారని టాక్ వినిపిస్తోంది. మార్వెల్ సిరీస్ లో నటించిన వారిని ఈ మూవీ కోసం ఎంపిక చేయబోతున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏకంగా 15 కోట్ల వరకు ఖర్చు చేశారు. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజికి వచ్చింది. జూన్ లేదా జూలైలో లాంచింగ్ ఉంటుంది. లాంచింగ్ సందర్భంగా కాస్టింగ్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇందులో మహేష్ బాబుకి విలన్ గా కచ్చితంగా ఓ హాలీవుడ్ నటుడు ఉంటాడని మాత్రం ప్రచారం సాగుతోంది. అలాగే హాలీవుడ్ హీరోయిన్ ని కూడా మహేష్ బాబుకు జోడిగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. దీపికా పడుకొనేతో పాటు హాలీవుడ్ హీరోయిన్ ని కూడా మహేష్‌కి జోడీగా తీసుకోనున్నారని తెలుస్తోంది.