English | Telugu
యానిమల్ కలెక్షన్ల సునామీ.. ప్రభాస్, షారుఖ్ సరసన నిలిచిన రణబీర్!
Updated : Dec 5, 2023
యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర తన దూకుడు కొనసాగిస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. భారీ అంచనాలతో డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజు రూ.116 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. రెండో రోజు రూ.120 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.120 కోట్ల గ్రాస్ తో మరింత జోరు చూపించిన యానిమల్ ఫస్ట్ వీకెండ్ లోనే రూ.356 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఇక నాలుగో రోజు సోమవారం అయినప్పటికీ రూ.69 కోట్ల గ్రాస్ తో సర్ ప్రైజ్ చేసింది. దీంతో నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.425 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే బుధవారం ఈ సినిమా రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశముంది.
అత్యధిక రూ.400 కోట్ల గ్రాస్ సినిమాలు కలిగిన ఇండియన్ హీరోలలో చెరో నాలుగు సినిమాలతో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ టాప్ లో ఉండగా.. చెరో మూడు సినిమాలతో ప్రభాస్, షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్, షారుఖ్ సరసన రణబీర్ కపూర్ చేరాడు. గతంలో 'సంజు', 'బ్రహ్మాస్త్ర' సినిమాలతో రూ.400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన.. ఇప్పుడు 'యానిమల్'తో మూడోసారి ఈ ఫీట్ సాధించాడు.