English | Telugu

జాన్వీ కపూర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న రాజమౌళి!

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ 'ఎన్టీఆర్ 30'(వర్కింగ్ టైటిల్). యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎస్.ఎస్.రాజమౌళి, ప్రశాంత్ నీల్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే రాజమౌళి ఆమెతో ప్రత్యేకంగా ముచ్చటించి, ఆమె ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

జాన్వీ కపూర్- రాజమౌళి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం, ఏవో పేపర్లపైన జాన్వీ సంతకం పెట్టడం చూసి.. వీరిద్దరి మధ్య సినిమాకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజమౌళి తన కూతురు మయూఖ కోసం జాన్వీ కపూర్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారట. మయూఖ జాన్వీకి అభిమాని కావడంతో.. 'ఎన్టీఆర్ 30' మూవీ లాంచ్ కి వెళ్తున్న తన తండ్రి రాజమౌళిని జాన్వీ ఆటోగ్రాఫ్ తీసుకురమ్మని కోరిందట. కూతురు కోరిక మేరకు రాజమౌళి జాన్వీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారట. ఏది ఏమైనా రాజమౌళి లాంటి బడా డైరెక్టర్ యంగ్ హీరోయిన్ జాన్వీ ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.