English | Telugu

'దాస్ కా ధమ్కీ'.. ఫస్ట్ డే రికార్డు స్థాయి కలెక్షన్లు!

విశ్వక్ సేన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం 'దాస్ కా ధమ్కీ'. ఉగాది కానుకగా నిన్న(మార్చి 22న) విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ మొదటి రోజు వసూళ్లు మాత్రం రికార్డు స్థాయిలో వచ్చాయి. ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టింది. అతని గత చిత్రాలు 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'ఓరి దేవుడా' ఫుల్ రన్ లో రూ.5-6 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టగా.. 'దాస్ కా ధమ్కీ' మాత్రం మొదటిరోజే రూ.4 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సత్తా చాటింది.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు నైజాంలో రూ.91 లక్షల షేర్, సీడెడ్ లో రూ.43 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.1.72 కోట్ల షేర్ వసూలు చేసిన దాస్ కా ధమ్కీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.3.06 కోట్ల షేర్(రూ.5.85 కోట్ల గ్రాస్) రాబట్టింది. రెస్టాఫ్ ఇండియా రూ.40 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.62 లక్షల షేర్ కలిపి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.4.08 కోట్ల షేర్(రూ.8.20 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. మూవీ ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.7.5 కోట్లు కాగా మొదటి రోజే సగానికి పైగా రాబట్టడం విశేషం. ఈ వీకెండ్ లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి విజయాన్ని అందుకునేలా ఉంది.

'దాస్ కా ధమ్కీ'కి ఈస్థాయి ఓపెనింగ్స్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. ఈ సినిమాలో రెండు పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ట్రైలర్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రీరిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రావడం కూడా కలిసొచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా ఉగాది కావడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు కదిలారు. ప్రస్తుతం థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం, చెప్పుకోదగ్గ కమర్షియల్ సినిమా ఇదొక్క కావడంతో ప్రేక్షకులు ఎక్కువగా ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించారు. అవన్నీ కలిసొచ్చి 'దాస్ కా ధమ్కీ'కి ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.