English | Telugu
ఏప్రిల్ 12న బన్నీ గుర్రం
Updated : Feb 26, 2014
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "రేసుగుర్రం" చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, సలోని కథానాయికలు. ఇందులో శృతి ఒక పాట కూడా పాడింది. ఇందులో అల్లు అర్జున్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, డా.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో భోజ్ పురి నటుడు రవికిషన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.