English | Telugu
బ్యాగ్ లో బుల్లెట్టుతో హీరోయిన్..!
Updated : Feb 26, 2014
"వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్" సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన రకూల్ ప్రీత్ సింగ్ ను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఆమె ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో 8ఎం ఎం బుల్లెట్ కనిపించడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ బుల్లెట్ ఇండియాలో దొరకదు. కనుక ఇది నీ బ్యాగ్ లోకి ఎలా వచ్చిందంటూ ఢిల్లీ పోలీసులు ఆమెను దాదాపు నాలుగు గంటల వరకు ప్రశ్నించారు. ఇటీవలే బ్యాంకాక్ వెళ్ళినపుడు ఎవరైనా రహస్యంగా బ్యాగ్ లో వదిలేసి ఉండవచ్చని రకూల్ తెలిపింది. కానీ దాదాపు పోలీసుల ప్రశ్నల వేధింపుల తర్వాత అది డమ్మీ బుల్లెట్ అని అధికారులు తేల్చారు. ఈ అమ్మడు ఓ తమిళ సినిమాలో ఈ బుల్లెట్ ను వాడిందట. అప్పటి నుండి అది ఈమె బ్యాగ్ లోనే ఉన్నదట. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ మూవీ డీవీడీ తమకు పంపవలసిందిగా రకూల్ ను ఆదేశించారు. దాంతో ఈ అమ్మడు అక్కడి నుండి హమ్మయ్యా అని భయపడిందట.