English | Telugu
జులాయిగా మారుతున్న ఐష్ లవర్
Updated : Feb 26, 2014
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన "జులాయి" చిత్రం మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. "జీన్స్" సినిమాలో ఐశ్వర్యరాయ్ ను ప్రేమించే ప్రేమికుడి పాత్రలో నటించిన ప్రశాంత్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ రీమేక్ కూడా తమిళంలో విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు ప్రశాంత్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. మరి ఈ సినిమా ప్రశాంత్ కు ఎలాంటి సక్సెస్ దక్కుతుందో చూడాలి.