English | Telugu
పుష్ప యాక్టర్ అరెస్ట్.. అంత పని చేశాడా!
Updated : Dec 6, 2023
నటుడు జగదీశ్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ కేశవ పాత్రలో నటించిన యాక్టర్ అనగానే అందరూ యిట్టే గుర్తు పడతారు. ఒక్క సినిమాతోనే అంతలా గుర్తింపు తెచ్చుకున్నాడు జగదీశ్. అయితే ఇప్పుడు ఈ టాలెంటెడ్ యాక్టర్ అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది.
జగదీశ్ కెరీర్ మొదట్లో కొన్ని షార్ట్ ఫిల్మ్ లు, చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆ సమయంలో ఒక యువతితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారిందట. ఆ తర్వాత 'పుష్ప'తో జగదీశ్ కి మంచి పేరు రావడంతో పాటు, వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మరి ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ ఇటీవల జగదీశ్ ప్రేయసి ఆత్మహత్య చేసుకొని మరణించిందట. అయితే జగదీశ్ తమ కూతురిని ప్రేమ పేరుతో మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని యువతి తల్లిదండ్రులు హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారట. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జగదీశ్ ని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. మరణించిన యువతి జగదీశ్ ప్రేయసి కాదట. ఆమెతో జగదీశ్ కి పరిచయముందట. ఆ యువతి జూనియర్ ఆర్టిస్ట్ అని, ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉన్న సమయంలో ఫొటోలు తీసిన జగదీశ్.. ఆమెని బెదిరించాడని, దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.