English | Telugu

ఎన్టీఆర్ ప్రాజెక్ట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రశాంత్ నీల్!

ప్రస్తుతం 'దేవర'తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత వీలైనంత త్వరగా 'వార్-2' పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవి నుంచి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో బిజీ కావాలని చూస్తున్నాడు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రశాంత్ నీల్ చెప్పడం, ఇప్పటికే విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ వయలెంట్ గా ఉండటంతో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు నీల్.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్' డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నీల్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఇది డిఫరెంట్ ఎమోషన్స్‌తో కూడిన డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది. నేను జానర్‌ గురించి చెప్పను. కానీ అందరూ దీనిని యాక్షన్ చిత్రంగా భావిస్తున్నారని తెలుసు. ఇది నాకు చాలా కొత్త కథ. ఇది నా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను." అని నీల్ చెప్పుకొచ్చాడు.

గతంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన నీల్.. ఇప్పుడు కథ చాలా కొత్తగా ఉంటుందని చెప్పడం బట్టి చూస్తుంటే.. ఎన్టీఆర్ తో కలిసి ఏదో పెద్దగానో ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తోంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.