English | Telugu
'పుష్ప-2' సెట్స్ లో ఎన్టీఆర్!
Updated : Apr 27, 2023
టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య ఎంత మంచి అనుబంధముందో తెలిసిందే. ఇద్దరూ బావ బావ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే బావ' అని ట్వీట్ చేసిన తారక్ 'పార్టీ లేదా పుష్ప' అని అడగడం.. దానికి 'వస్తున్నా' అని బన్నీ రిప్లై ఇవ్వడం ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించింది. ఇక తాజాగా 'పుష్ప-2' సెట్స్ లో తారక్ సందడి చేయడం ఫ్యాన్స్ కి మరింత ఆనందాన్ని ఇచ్చింది.
ఎన్టీఆర్ తన 30 వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తుండగా.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'పుష్ప-2' సినిమా చేస్తున్నాడు. ఈ రెండు పాన్ ఇండియా సినిమాల షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తారక్ 'పుష్ప-2' సెట్స్ లో సందడి చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గతంలోనూ పలు సినిమా వేడుకల్లో, షూటింగ్స్ లో తారక్-బన్నీ ఇలాగే కలిశారు. పదేళ్ల క్రితం బాద్ షా, ఇద్దరమ్మాయిలతో సినిమాల షూటింగ్ కూడా ఒకే సమయంలో ఒకే చోట జరగగా.. చిత్ర బృందాలతో కలిసి తారక్, బన్నీ సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చారు. పెద్ద స్టార్స్ అయినప్పటికీ ఇనేళ్ళుగా వారి మధ్య స్నేహబంధం అలాగే కొనసాగుతుండటం విశేషం.