English | Telugu

కొత్త మొగుడు.. కొత్త నగలు.. అంతా తూచ్!


బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆ ఫొటోస్ షేర్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక ఆమె బిజీగా మారిపోయింది. ఎన్నో టీవీ షోస్, ఈవెంట్స్ చేస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఇప్పుడు తన పెళ్లి అంటూ మెహేంది ఫంక్షన్ ఫొటోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి. "నాకు పెళ్లి అని హల్దీ ఫొటోస్ చూశామని గాసిప్స్ వస్తున్నాయి కదా వాటికీ చెక్ పెట్టడానికి ఈరోజు మీ ముందుకొచ్చాను. నిజమే మీరు అనుకునేది త్వరలో నేను పెళ్లి చేసుకోబోతున్నాను...ఐతే ఇంట్లో అందరూ ఒప్పుకున్నాక చెపుదామని అనుకున్నా...సరే ఇప్పుడు ఆయన ఎవరు, ఎం చేస్తారు అన్నీ లాస్ట్ లో చెప్తాను. పెళ్ళికి కొంత టైం మాత్రమే ఉంది కదా ముందుగా పెళ్లి నగల షాపింగ్ చేద్దాం...కొత్త మొగుడు, కొత్త నగలు అన్నీ నాకు కూడా కొత్త కొత్తగా ఉంది..ఈ భారం మొత్తాన్ని ఆ దేవుడి మీద వేసేసి చాలా ధైర్యం తెచ్చుకుని ఈ వీడియో చేస్తున్నాను" అని చెప్పి నగల షాపింగ్ మొత్తం చేసి ఊరించి ఊరించి చివరికి షాక్ ఇచ్చింది.

పింకీకి ఇప్పుడప్పుడే పెళ్లి అవదు. ఇది జస్ట్ ప్రాంక్ వీడియో..అసలైతే నా పెళ్లి కాదు మా ఫ్రెండ్ ది..తనకు ఇవ్వడానికి ఈ నగలు తీసుకుంటున్నా" అని చెప్పి సర్ప్రైజ్ చేసింది. ఈమె ఫాన్స్, నెటిజన్స్ చాలా నిరాశపడ్డారు తన మాటలకు. మమ్మల్ని ఇలా ఊరించి ఊరించి చివరికి ఇలా తూచ్ అనడం నీకేమైనా బాగుందా అని నెగటివ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.