English | Telugu

ఉగాదికి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న 'వినోదయ సిత్తం' రీమేక్ ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఇటీవల పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఉగాదికి ఈ సినిమా నుంచి బిగ్ సర్ ప్రైజ్ రాబోతుందని తెలుస్తోంది.

ఉగాది కానుకగా మార్చి 22న ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రివీల్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ చిత్రానికి 'దేవర', 'దేవుడు' అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఒకదానిని ఎంచుకున్నారా లేక మరో కొత్త టైటిల్ ని ఖరారు చేశారా అనేది త్వరలో తేలిపోనుంది. ఈ సినిమాలో పవన్ దేవుడిలా కనిపించనున్నారు. గతంలో 'గోపాల గోపాల' చిత్రంలోనూ ఆయన ఈ తరహా పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ అయిన పవన్ లుక్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోల్లో పవన్ లుక్ ఆకట్టుకుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.