English | Telugu

'PVT04'లో విలన్ గా జోజు జార్జ్.. పోస్టర్ అదిరింది!

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. వైష్ణవ్ తేజ్ కెరీర్ లో నాలుగో సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

'ఉప్పెన'తో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్.. ఆ తరువాత చేసిన 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా' సినిమాలతో నిరాశపరిచాడు. ఈ క్రమంలో తన నాలుగో సినిమాతో మళ్ళీ హిట్ కొట్టి లెక్క సరిచేయాలని చూస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంలో సరికొత్త మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం నుంచి ప్రతినాయకుడి పాత్రను పరిచయం చేస్తూ తాజాగా చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ చిత్రంలో చెంగా రెడ్డి అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఇరాట్ట, జోసెఫ్, నయత్తు, తురముఖం, మధురం వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన పలు పురస్కారాలను సైతం అందుకున్నారు. ఇప్పుడు ఈయన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆయన పోషిస్తున్న చెంగా రెడ్డి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఒక చేత్తో పదునైన ఆయుధాన్ని పట్టుకొని, మరో చేత్తో లైటర్ తో నోట్లోని సిగరెట్ ను వెలిగిస్తూ కళ్ళతోనే క్రూరత్వాన్ని పలికిస్తూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో ఉన్న జోజు జార్జ్ పాత్ర తాలూకు పోస్టర్ పవర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంది. చిత్ర టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 29, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.