English | Telugu

మహేష్ బాబు మాట వింటాడా...?

మహేష్ బాబు మాట వింటాడా...? అంటే ఏ విషయంలో అనే అనుమానం మీకొస్తుంది. విషయమేమిటంటే ఈ మధ్య శ్రీమతి విజయనిర్మల, నరేష్ ఇద్దరూ కలసి వై.యస్.ఆర్ కాంగ్రేస్ లో చేరటానికి, ఆ పార్టీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డిని గుంటూరుకు వెళ్ళి మరీ కలిసొచ్చారు. దీని వెనుక సూపర్ స్టార్ హస్తం ఉందనీ, ఆయన హస్తం గుర్తు పార్టీకి వీడికోలు చెపుతూ, వై.యస్.ఆర్ కాంగ్రేస్ లో చేరటానికి వేడికోలే విజయనిర్మల, నరేష్ ఇద్దరూ కలసి ఆ పార్టీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డిని కలవటానికి కారణమని సినీ విశ్లేషకులంటున్నారు.

అదే నిజమైతే ఆయన కుమారుడు తెలుగు యువ హీరోల్లో టాప్ పొజిషన్ లో ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు ఆ పార్టీలో చేరతాడా...? అసలు రాజకీయాలంటేనే పడని మహేష్ బాబు నంది అవార్డుల సభలో, వై.యస్.ఆర్. ఉన్నప్పుడే చేయి ఊపటానికి కూడా ఇష్టపడలేదు. తండ్రి కృష్ణ బలవంతం మీద జనాన్ని చూస్తూ చేయి ఊపాడు. అలాంటి మహేష్ బాబు వై.యస్.ఆర్ కాంగ్రేస్ లో చేరటానికి ఇష్టపడతాడా...? లేదా...? అన్నవిషయం మీద మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.