English | Telugu

విదేశాల నుండి తిరిగి రానున్న అల్లు అర్జున్

విదేశాల నుండి తిరిగి రానున్న అల్లు అర్జున్ అని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే తెలుగులో ప్రముఖ యువ హీరోగా వెలుగుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ మధ్య విదేశాలకు వెళ్ళారు. ఇది ఒక విధంగా హనీమూన్ అనుకోవచ్చు. ఎందుకంటే కండలు పెంచిన కొత్తపెళ్ళి కొడుకు భార్యనొదిలి విదేశాలకు ఎందుకెళ్తాడు చెప్పండి. అలా భార్యా సమేతంగా అల్లు అర్జున్ యు.యస్.కీ, స్విట్జర్ల్యాండ్ కీ వెళ్ళి సరదాగా తిరిగి మళ్ళీ జూలై 15 వ తేదీన ఇండియాకి తిరిగి వస్తున్నారట.

ఆయన ఇండియాకి తిరిగి రాగానే, తాను హీరోగా నటించబోయే కొత్త సినిమా యొక్క వివరాలు ప్రకటిస్తారట. అల్లు అర్జున్ ఇటీవల హీరోగా నటించగా విడుదలైన "బద్రినాథ్" చిత్రం ఊహించిన స్థాయిలో ఘనవిజయం సాధించకపోవటంతో కొన్నాళ్ళు అలా విదేశాలకు వెళ్ళి తిరిగి రెట్టించిన నూతనోత్సాహంతో మళ్ళీ తన కొత్త సినిమాలో నటించబోతున్నారు అల్లు అర్జున్.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.