English | Telugu

మళ్ళీ పాత దారిలో దర్శక, నిర్మాత తేజ

మళ్ళీ పాత దారిలో దర్శక, నిర్మాత తేజ పయనించనున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఉదయ కిరణ్ హీరోగా, రీమా సేన్ జంటగా నటించిన "చిత్రం" ద్వారా దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ తేజ ఆ తర్వాత "నువ్వు-నేను, జయం" వంటి చక్కని హిట్ చిత్రాలను అందించాడు. కానీ ఈ మధ్య అతనికి ఒక్క సినిమా కూడా హిట్‍ రాలేదు. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ పతాకంపై, అందరూ కొత్తవారే నటించబోతుండగా, ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకి తేజ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

ఒకప్పుడు "చిత్రం" సినిమాలో కూడా అందరినీ కొత్తవారినే తీసుకున్నాడు దర్శకుడు తేజ. కానీ ఆ తర్వాత తన బాణీ మార్చుకుని కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించినా ఆ సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రం ద్వారా అందరూ కొత్తవారినే ఎన్నుకుంటున్నాడు తేజ. స్వధర్మమే ఆదర్శం అని గీతాచార్యుడు చెప్పినట్టు తనపంధానే నమ్ముకున్నాడు తేజ.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.