English | Telugu
నాలుగు జాతీయ అవార్డులు సాధించిన దర్శకుడితో యంగ్ టైగర్!
Updated : Feb 11, 2023
ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించబోయే తదుపరి చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఎన్టీఆర్ తో కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. దీనికి ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ కేజిఎఫ్ ఫ్రాంచైజ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ చిత్రం చేయనున్నారు. ఆ తరువాత ఆయన ఓ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. కొరటాల శివ సినిమాని ఈనెల 20వ తేదీన లాంచనంగా పూజతో ప్రారంభించి మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారు. ఇక తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం మైత్రి మూవీ సంస్థ ఐదు కోట్ల అడ్వాన్స్ కూడా వెట్రిమారన్ కి ఇచ్చిందని సమాచారం.
ఇందులో ఎన్టీఆర్ మాత్రమే కాకుండా మరో కోలీవుడ్ స్టార్ అయిన ధనుష్ కూడా నటిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు దర్శకుడు వెట్రిమారన్ ఎక్కువగా ధనుష్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన ఖాతాలో ఇప్పటివరకు నాలుగు జాతీయ పురస్కారాలు ఉన్నాయి. దాంతో ఎన్టీఆర్- ధనుష్ -వెట్రిమారన్ కాంబినేషన్ పై అన్నిచోట్ల ఆసక్తి మొదలైంది. అందునా తెలుగులో నెంబర్ వన్ ప్రొడక్షన్ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని రూపొందిస్తూ ఉండడంతో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. సాధారణంగా ఈమధ్య తెలుగు సినిమాలపై తమిళ తంబీలు మండిపడుతున్నారు. కారణం ఏమిటో తెలియదు గానీ బాలీవుడ్ ని మించి టాలీవుడ్ ఎదుగుతుందని కసితో కోపంతో వారు తెలుగు చిత్రాలపై ట్రోలింగ్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని వాదన ఉంది. వారు కోలీవుడ్ కంటే ఇతర భాషల వారు కాస్త ముందడుగు వేస్తే సహించలేరు.
కానీ అనూహ్యంగా ఎన్టీఆర్ వెట్రి మారన్ సినిమాపై తమిళ ప్రేక్షకులు పాజిటివ్‌గాస్పందిస్తున్నారు. వెట్రిమారన్ తో ఎన్టీఆర్ చేయబోయే చిత్రానికి కోలీవుడ్ మీడియా కూడా అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ వెట్రిమారన్ కాంబినేషన్లో సినిమా అంటే అందులో ధనుష్ నటించిన ఈ చిత్రం కావడంతో ఈ మూవీ తెలుగు తమిళంలో భారీ అంచనాలను పెంచే అవకాశం ఉం. అందునా ఇది పాన్ ఇండియా మూవీ కావడం ఎన్టీఆర్ తో పాటు ధనుష్ కి కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మొత్తానికి ఈ చిత్రం ఇదే కాంబోలో రూపొందితే మాత్రం అంచనాలు తారాస్థాయిలో ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.