English | Telugu

చరణం కి నేను వీరాభిమానిని అంటున్న ప్రభాస్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)ప్రస్తుతం ది రాజా సాబ్(the raja saab)షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల కానుండటంతో కంటిన్యూగా షూటింగ్ ని జరుపుకుంటుంది.ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన రాజా సాబ్ లుక్ ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను అంచనాలని పెంచింది.

 రీసెంట్ గా సిరివెన్నెల సీతారామశాస్త్రి(sirivennela sitaramasastri)కి నివాళులు అర్పిస్తు ప్రముఖ ఛానల్  ఈటీవీ లో ప్రసారమవుతున్న 'నా ఉఛ్వాసం కవనం'(naa uchvasam kavanam)కార్యక్రమానికి ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.అందులో ప్రభాస్  మాట్లాడుతు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో వచ్చిన పాటలన్ని నాకు  చాలా ఇష్టం.'సిరివెన్నెల' సినిమాలోని విధాత తలపున ప్రభవించినది పాట చాలా గొప్పగా ఉంటుంది.సరసుస్వర సుర ఝారి గమనమౌ సామ వేద సారమిది లైన్స్ ని ఎంతో  గొప్పగా రాసారు.ఆయన పెన్ను పెట్టగానే ఇలాంటి గొప్ప లిరిక్స్ వచ్చేస్తాయేమో.నిన్నే పెళ్లాడుతా సినిమాల్లోని కన్నుల్లో నీ రూపమే పాట అంటే నాకు చాలా ఇష్టం ఆ పాటలో వచ్చే చరణాలకి నేను వీరాభిమానిని.

ప్రతి తరానికి సరిపోయేలా రాయడం ఆయన గొప్ప తనం. శివ సినిమాలో ఆయన రాసిన బోటనీ పాట ముంది పాటప్పుడు నేను ఐదో క్లాస్ చదుతున్నాను ఎక్కడికెళ్లినా ఈ పాటనే పాడే వాడ్ని. గాయం, చక్రం, అంకురం, గాయం  సినిమాల్లోని పాటలు ఎంతో మందికి స్ఫూర్తిని నింపాయి. వ్యక్తిగతంగా కూడా ఆయనకి నాకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం కూడా ఉందని  చెప్పుకొచ్చాడు.