English | Telugu

చైతన్య-శోభిత పెళ్ళి ముహూర్తం ఖరారు..!

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) నిశ్చితార్థం ఆగస్టులో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థం జరిగి దాదాపు మూడు నెలలు అవుతుంది. దీంతో వీరి వివాహం కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. చైతన్య-శోభిత పెళ్ళికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 4న హైదరాబాద్ లో చైతన్య-శోభిత వివాహం జరగనుందట. అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి పెళ్లి కోసం ప్రత్యేకంగా మండపాన్ని నిర్మిస్తున్నారట. బంధువులు, సన్నిహితులతో పాటు సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారని సమాచారం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.