English | Telugu

ఓటీటీలోకి దేవర.. ఇక్కడా ఎన్టీఆర్ తాండవమేనా?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'దేవర' (Devara). ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షోకే డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ, టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపించింది. యాక్షన్ సన్నివేశాలు, ఎన్టీఆర్ పర్ఫామెన్స్, డ్యాన్సులు.. అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. అందుకే భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. (Devara OTT)

'దేవర' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని రికార్డు ధరకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయింది. నవంబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే థియేటర్లలో విడుదలైన ఆరు వారాలకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది అన్నమాట.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన 'దేవర'లో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దేవరకి పార్ట్-2 కూడా ఉంది. వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశముంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.