English | Telugu
సూపర్‌స్టార్‌పై కేసు నమోదు.. మళ్ళీ వైరల్‌గా మారిన వైనం!
Updated : Sep 27, 2023
సాధారణంగా క్రికెటర్లకు, సినిమా సెలబ్రిటీస్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఎంతలా ఉంటుందంటే తమ అభిమాన నటుడుగానీ, క్రికెటర్‌గానీ ఒక కంపెనీ యాడ్‌లో కనిపిస్తే ఆ ప్రొడక్ట్ వాడతారు. ఈ సెలబ్రిటీస్‌కి ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో ఉంచుకొని పాపులర్ బ్రాండ్స్ కూడా వారికి భారీ మొత్తంలో పారితోషికం ముట్టజెప్పి తమ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. మామూలుగా 10 సెకన్లు కనిపించే ఈ యాడ్ ఆయా కంపెనీలకు ఎంతో ఇంపార్టెంట్. డబ్బు బాగానే ముట్టచెపుతారు కాబట్టి సెలబ్రిటీలు కూడా ఆయా కంపెనీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాయి. అయితే వారికి డబ్బు రావడం ఎంత సాధారణమో, ఇబ్బందులూ అంతే సహజం.
బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ఒక పాన్ మసాలా యాడ్ నటించి ఇబ్బందుల పాలయ్యాడు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టికి కూడా ఇలాంటి అనుభవం గతంలో ఎదురైంది. ఇప్పుడు మమ్ముట్టికి ఓ కొత్త సమస్య ఎదురైంది. ఒక ఫెయిర్‌నెస్ సోప్ ప్రొడక్ట్‌కి మమ్ముట్టి అంబాసిడర్‌గా వ్యవరిస్తున్నాడు. ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన యాడ్‌లో నటించినందుకు ఇప్పుడు అతనిపై కేసు నమోదైంది. ఆ సబ్బు వాడమంటూ మమ్ముట్టి చేసిన యాడ్‌ను చూసిన ఓ వ్యక్తి సంవత్సర కాలంగా ఆ సోప్‌ను వాడుతున్నాడట. అయినా ఆ యాడ్ చూపిన విధంగా తన చర్మం రంగు మారకపోవడంతో కన్‌స్యూమర్ కోర్టును ఆశ్రయించి ఆ సోప్ కంపెనీతోపాటు ఆ ప్రొడక్ట్ కోసం ప్రచారం చేసిన మమ్ముట్టిపై కేసు పెట్టాడు. ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ కేసు వ్యవహారం గత కొంతకాలంగా నడుస్తూనే వుంది. ఇప్పుడు ఈ కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాంటి యాడ్స్ నటించడం మమ్ముట్టి తప్పు అని కొందరంటుంటే,, అలాంటి ప్రొడక్ట్ తయారు చేయడం ఆ కంపెనీ తప్పు అని డిస్కషన్స్ చేసుకుంటున్నారు.