English | Telugu

‘లియో’ ఆడియో ఫంక్షన్ రద్దు: విజయ్ రాజకీయ బెదిరింపులకు భయపడ్డాడా?

తమిళ నాట ఇళయ దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు.హిమాలయ శిఖరాలని దాటిన ఇమేజ్ విజయ్ సొంతం. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు తమిళనాడు మొత్తం పండుగ వాతావరణం నెలకొంటుంది. తమ తమ పనుల్నిసైతం పక్కన పెట్టి విజయ్ సినిమా ఆడుతున్న సినిమా థియేటర్ల ముందు తమిళ ప్రజలు ప్రత్యక్షమవుతారు. అంతటి ఇమేజ్ ని సంపాదించిన విజయ్ కొంతమందికి భయపడి తన కొత్త సినిమా లియో ఆడియో ఫంక్షన్ ని రద్దు చేసుకున్నాడనే వార్త తమిళ చిత్ర రంగంలో సంచలనం సృష్టిస్తుంది.

దశాబ్ద కాలం నుంచి విజయ్ తమిళ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా ముందుకు దూసుకుపోతున్నాడు.తాజాగా ఆయన తమిళ సూపర్ డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ తో లియో సినిమాని చేస్తున్నాడు. విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో లియో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు .ఇంకా పక్కాగా చెప్పాలంటే భారత దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు సైతం లియో సినిమా చూడటం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు.ఇంక అసలు విషయానికి వస్తే.. ఆ సినిమాకి అయినా ఆడియో ఫంక్షన్ మంచి బూస్టప్ ని ఇస్తుంది. ఆడియో ఫంక్షన్ లో ఆయా హీరోల అభిమానుల కోలాహలం ఒక రేంజ్ లో ఉంటుంది. తమ అభిమాన హీరో సినిమా గురించి మాట్లాడే మాటలు ఎలా వుంటాయో అని ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. లియో సినిమా కి సంబంధించి కూడా విజయ్ ఫాన్స్ అలాగే భావించారు.

కానీ ఇప్పుడు లియో ఆడియో ఫంక్షన్ ని రద్దు చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించడం తో విజయ్ అభిమానుల తో పాటు సినీ అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.తమ అభిమాన హీరో విజయ్ ఆడియో ఫంక్షన్ లో ఏం మాట్లాడతాడో అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ నిర్ణయం తో విజయ్ఎం అభిమానులు ఎంతగానో బాధ పడ్తున్నారు. కొంత మంది అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా తమ బాధని వెల్లడి చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థకి రకరకాలుగా ప్రశ్నిస్తుంది.అభిమానుల బాధని అర్ధం చేసుకున్న చిత్ర బృందం ఫంక్షన్ ఎందుకు రద్దు చేసామో అనే వివరణని ఇచ్చింది.

ఫంక్షన్ కి విజయ్ ఫాన్స్ చాలా మంది వస్తారని వాళ్ళందిరికి పాస్ లు ఇవ్వడం సాధ్యం కాదని అలాగే క్రౌడ్ ని కూడా తట్టుకోలేమని అందుకే క్యాన్సిల్ చేశామని కానీ సినినిమాకి సంబంధించిన అప్ డేట్ ని ఎప్పటికప్పుడుప్రచార సాధనాల ద్వారా అభిమానుల ముందు ఉంచుతామని చెప్పింది .కానీ విజయ్ సినిమా ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ వెనుక ఒక రాజకీయ పార్టీ హస్తం ఉందనే వార్త తమిళ నాట చక్కర్లు కొడుతుంది. ఇదే నిజమైతే తమిళనాట రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అని కొంత మంది అంటున్నారు.విజయ్ ఎన్నో సంవత్సరాల నుంచి తన ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నాడు .అలాగే ఎప్పటికప్పుడు విజయ్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడనే వార్త తమిళనాడులో వినిపిస్తూనే ఉంటుంది .కాగా లియో సినిమా అక్టోబర్ 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.