English | Telugu

కళ్ళు చెదిరేలా 'స్కంద' బిజినెస్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'స్కంద' రేపు(సెప్టెంబర్ 28న) ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఇస్మార్ట్ శంకర్' నుంచి రామ్ మాస్ జపం చేస్తున్నాడు. దానికితోడు ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి తోడయ్యాడు. అందుకు తగ్గట్టుగానే కళ్ళు చెదిరేలా 'స్కంద' థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోనే స్కంద ఏకంగా రూ.41 కోట్ల బిజినెస్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.13 కోట్లు, సీడెడ్ లో రూ.8.50 కోట్లు, ఆంధ్రాలో రూ.19.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా రూ.3 కోట్లు, ఓవర్సీస్ లో రూ.2.20 కోట్లు కలిపి.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.46.20 కోట్ల బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే కనీసం రూ.47 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.

రామ్ కెరీర్ లో ఇదే అత్యధిక బిజినెస్. అతని గత చిత్రం 'ది వారియర్' రూ.38 కోట్ల బిజినెస్ చేయగా.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మరి ఇప్పుడు ఏకంగా రూ.46 కోట్ల బిజినెస్ చేసిన స్కంద.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అయితే ఈసారి బోయపాటి కూడా తోడు కావడంతో హిట్ టాక్ వస్తే రూ.50 కోట్ల షేర్ అందుకోవడం రామ్ కి పెద్ద కష్టం కాకపోవచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.