English | Telugu

మాళవికతో కలిసి 'కఫీఫీ' అంటున్న నాగశౌర్య

'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి ఫీల్ గుడ్ సినిమాలతో ఘన విజయాలను అందుకున్న యువ హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. నాలుగు పాటలు, నేపథ్య సంగీతం కళ్యాణి మాలిక్ అందించగా.. ఒక పాట వివేక్ సాగర్ స్వరపరచడం విశేషం. కళ్యాణి మాలిక్ స్వరపరిచిన పాటల్లో ఇప్పటికే మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన 'కఫీఫీ' పాట విడుదలైంది.

'కఫీఫీ' లిరికల్ వీడియోను బుధవారం ఉదయం విడుదల చేశారు మేకర్స్. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నుండి ఇప్పటిదాకా విడుదలైన పాటలు హాయిగా, ఆహ్లాదకరంగా సాగే మెలోడీలు అయితే.. ఈ పెప్పీ నెంబర్ మాత్రం అందరిలో ఉత్సాహాన్ని నింపేలా ఉంది. 'కఫీఫీ' అంటూ అందరూ కాలు కదిపేలా అద్బుతమైన బాణీ సమకూర్చారు వివేక్. "నలుగురిలో ఉంటే.. చిలిపిగ పోతుంటే.. చనువుకి నో నో చెప్పేదే కఫీఫీ" అంటూ పాట సాగింది. పాట సందర్భానికి, బాణీకి తగ్గట్లుగా కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం అందంగా, అర్థవంతంగా ఉంది. "ఇది అది కాదంటూ.. వివరము వేరంటూ.. పరిమితిలోనే ఉంచేదే కఫీఫీ", " పరిధులు లేని వింత సహవాసం పరిగెడుతుంటే తగదుగా" అంటూ మళ్లీ మళ్లీ పాడుకునేలా క్యాచీ లిరిక్స్ తో లోతైన భావాన్ని పలికించారు. గాయకులు బెన్ హ్యూమన్, విష్ణుప్రియ తమ మధుర గాత్రంతో పాటను ఎంతో ఉత్సాహంగా ఆలపించారు.

'కఫీఫీ' సాంగ్ ఎంత ఎనర్జిటిక్ గా సాగిందో.. లిరికల్ వీడియోలో నాగశౌర్య, మాళవిక అంతకంటే ఎనర్జిటిక్ గా కనిపించారు. పబ్ లో జరుగుతున్న పార్టీలో స్నేహితులతో కలిసి హీరోహీరోయిన్లు ఉత్సాహంగా చిందేయడం అలరిస్తోంది. నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరూ పోటీపడి డ్యాన్స్ చేస్తున్నారు. పాటలోని ఉత్సాహాన్ని, హీరోహీరోయిన్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ యశ్ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈ పాటకి థియేటర్లలో అద్భుతమైన స్పందన లభించడం ఖాయమనిపిస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .