Read more!

English | Telugu

'దసరా'కు అదే పెద్ద మైనస్!

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'దసరా'. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీతో నాని పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమాని ఒక నెగటివ్ సెంటిమెంట్ వెంటాడుతోంది.

సినిమావారు సెంటిమెంట్ లను బాగానే నమ్ముతారు. హిట్ కాంబినేషన్ లను రిపీట్ చేస్తారు, ఫ్లాప్ కాంబోలను పక్కన పెడుతుంటారు. అయితే అసలు సినిమాను నిర్మించే బ్యానరే నెగటివ్ సెంటిమెంట్ అయితే ఏం చేస్తారు?. ఇప్పుడు 'దసరా'ను అలాంటి నెగటివ్ సెంటిమెంటే వెంటాడుతోంది. ఈ సినిమాని నిర్మిస్తున్న ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో గతంలో 'లయన్', 'పడి పడి లేచే మనసు', 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'విరాట పర్వం', 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి సినిమాలు రూపొందాయి. అయితే ఇందులో ఒక్క చిత్రం కూడా విజయం సాధించలేదు. 'విరాట పర్వం' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. ఇలా అసలు విజయమే లేని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా 'దసరా' రూపొందుతోంది. బ్యానర్ కి హిట్ లేదనే ఒక్క నెగటివ్ సెంటిమెంట్ తప్ప.. ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ 'దసరా'పై పాజిటివ్ బజ్ ఉంది. మరి ఆ నెగటివ్ సెంటిమెంట్ ను ఈ చిత్రం బ్రేక్ చేసి అటు ఎస్ఎల్వీ సినిమాస్ కి, ఇటు నానిలో భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.