English | Telugu
హత్య కేసులో పవన్‌కల్యాణ్ విలన్ అరెస్ట్!
Updated : Dec 6, 2023
చిన్న వివాదం హత్యకు దారితీసింది. ఒక చెట్టును నరికే విషయంలో వివాదం తలెత్తడంతో ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా, మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిపై కాల్పులు జరిపిన వ్యక్తి భూపిందర్ సింగ్. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏమిటంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌన్‌కేదా ఖాద్రీ గ్రామంలో భూపిందర్‌కి ఒక ఫామ్ హౌజ్ ఉంది. ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది అక్కడ నివసిస్తున్నారు. భూపిందర్‌సింగ్ ఇంటి పక్కనే గుర్దీప్ సింగ్ కుటుంబం నివసిస్తుంది. కొంతకాలంగా విరిద్దరి సరిహద్దులో ఒక చెట్టు గురించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే చెట్టు విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. తాను నటుడిని అనే గౌరవం లేకుండా తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా అంటూ ఆవేశంతో తన వద్ద ఉన్న గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
అసలు ఎవరీ భూపిందర్ సింగ్.. జై మహాభారత్ సీరియల్‌తో తన యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. కొన్ని టీవీ సీరియల్స్‌లో కూడా నటించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో తమ్ముడు, అన్నయ్య, భలేవాడివిబాసు, విలన్, అంజి, శంకర్‌దాదా ఎంబీబీఎస్, దేవీపుత్రుడు వంటి చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా అతను చేసింది విలన్ క్యారెక్టర్సే. నటనకు గుడ్‌బై చెప్పి బిజినెస్ రంగంలో బిజీగా ఉన్న భూపిందర్ ఈ హత్యోదంతంతో వార్తల్లోకి వచ్చాడు.