English | Telugu

CMగా రేపే ప్రమాణ స్వీకారం... రేవంత్‌రెడ్డి ఫేవరెట్‌ హీరో ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు రేవంత్‌రెడ్డి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా రేవంత్‌రెడ్డి గురించే చర్చ. ఇక సోషల్‌ మీడియాలో చెప్పనక్కర్లేదు. అతని గురించి సెర్చింగ్‌ ఎక్కువైంది. ఇంతకుముందు రేవంత్‌రెడ్డి అంటే ఒక లీడర్‌గా మాత్రమే తెలుసు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేతగా పలువురు దృష్టిని ఆకర్షిస్తున్నారు. డిసెంబర్‌ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు రేవంత్‌రెడ్డి. మొదటినుంచి చాలా ఓపెన్‌గా ఉండే రేవంత్‌ ఉన్నది ఉన్నట్టు మొహంమీదే చెప్పే తత్వం ఆయనది.

ఇదిలా ఉంటే.. మొదటి నుంచి రేవంత్‌కి టాలీవుడ్‌ హీరోలతో మంచి స్నేహం ఉంది. ఈ విషయం తెలిసిన వారు రేవంత్‌ ఫేవరెట్‌ హీరో ఎవరు అని ఆరా తీస్తే.. సూపర్‌స్టార్‌ కృష్ణ అని తెలిసింది. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పినట్టు గుర్తించారు నెటిజన్లు. దీంతో ఇప్పుడా విషయాన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. యంగ్‌ జనరేషన్‌ హీరోలు చేస్తున్న సినిమాలు ఎక్కువగా చూడని రేవంత్‌.. సూపర్‌స్టార్‌ కృష్ణ సినిమాలు మాత్రం ఎక్కువగా చూస్తుంటారట. కృష్ణ అంటే తనకెంతో అభిమానమని ఆ ఇంటర్వ్యూలో వెల్లడిరచారు రేవంత్‌.