English | Telugu
యానిమల్ నటి త్రిప్తి,రవితేజ విషయంలో వస్తున్న రూమర్స్ కి చెక్
Updated : Dec 6, 2023
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మీద మంచి అంచనాలే ఉన్నాయి. నిన్న ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్ కి అని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ చిత్రం తర్వాత రవితేజ చెయ్యబోయే సినిమాలోని హీరోయిన్ విషయంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ రూమర్స్ కి చెక్ పడింది.
ఈగల్ తర్వాత రవితేజ చెయ్యబోయే సినిమాలో రవితేజ సరసన త్రిప్తి నటించబోతుందనే వార్తలు వచ్చాయి. త్రిప్తి ఇటీవల వచ్చిన యానిమల్ మూవీలో రణబీర్ సెకండ్ లవర్ గా విజృంభించి చేసింది. ముఖ్యంగా రణబీర్ తో కలిసి స్క్రీన్ మీద లిప్ లాక్ చెయ్యడమే కాకుండా బోల్డ్ గా కూడా నటించి ఒక్కసారిగా యువకుల హృదయాలని కొల్లగొట్టింది.అలాగే ఓవర్ నైట్ స్టార్ గా కూడా ఎదిగింది. దీంతో ఇండస్ట్రీ వర్గాలు మొత్తం రవితేజ సరసన త్రిప్తి నటిస్తే కనుక ఆ సినిమా సంచలనం సృష్టించడం ఖాయమని అనుకున్నారు. కానీ ఆ వార్త ఒట్టి రూమర్ అని తేలిపోయింది.
ఇక పోతే సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి రవితేజ, త్రిప్తి కలయికలో సినిమా వస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రవితేజ అభిమానులు మాత్రం ఆ ఇద్దరి కాంబోలో వచ్చే సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన కోసం ఎదురు చూసారు. కానీ ఇప్పుడు అవన్నీ రూమర్స్ అని తేలడంతో నిరుత్సాహ పడుతున్నారు.