English | Telugu

పవన్ కళ్యాణ్ 3డి సినిమా చేయటం లేదు

పవన్ కళ్యాణ్ 3డి సినిమా చేయటం లేదు అని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రభుదేవా సోదరుడూ, కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన రాజు సుందరం దర్శకత్వంలో ఒక 3డి సినిమా ఒకటి రానుందని ముందుగా ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఆ చిత్రాన్ని ప్రముహ నిర్మాత "ఛత్రపతి" ప్రసాద్ అంటే బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మించనున్నారనీ తెలిసింది.

కానీ అదంతా అబద్ధమనీ, పవన్ కళ్యాణ్ ఎలాంటి 3డి సినిమాలోనూ నటించటంలేదనీ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మనుషులు కచ్చితంగా మీడియాకు తెలియజేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ తమ అభిమాన హీరో 3డి సినిమాలో నటిస్తున్నాడని ఆనందించినంతసేపు లేకుండానే అది నిజం కాదనే సంగతి బయటకొచ్చింది. అదండీ విషయం.