English | Telugu

లెక్చరర్ గా ప్రిన్స్ మహేష్ బాబు

లెక్చరర్ గా ప్రిన్స్ మహేష్ బాబు నటించనున్నాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్‍ "దూకుడు" చిత్రాన్ని నిర్మించిన రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట, అనీల్ సుంకర మళ్ళీ మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ చిత్రంలో కూడా ప్రిన్స్ మహేష్ బాబే హీరో కావటం విశేషం. లెక్కల మాస్టారు దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వారు ఒక చక్కని చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు.

ఈ చిత్రానికి స్క్రిప్ట్ తయారయ్యిందట. లెక్కల లెక్చరర్ గా తన నిజ జీవితానుభవాలను జోడించి సరదాగా ఉండేలా దర్శకుడు సుకుమార్ ఈ కథని రూపొందించారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు లెక్చరర్ గా నటించనున్నారట. ఈ చిత్రం ఫిబ్రవరి నెలాఖరులో ప్రారంభం కానుందట.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.