English | Telugu

ఎంతగానో చింతిస్తున్నాను.. పవన్ కళ్యాణ్ అధికార లేఖ విడుదల 


-పవన్ అధికార లేఖ విడుదల
-లేఖ లో ఏముంది
-చిరంజీవితో ఇప్పటికి గుర్తుండిపోతుంది


భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న లెజండ్రీ ప్రొడ్యూసర్లలో 'ఎ.వి.ఎం(AVM)సంస్థ అధినేత 'శరవణన్‌'(Saravanan)కూడా ఒకరు. హీరోతో పాటు 24 క్రాఫ్ట్స్ మొత్తం ఎ.వి.ఎం. సంస్థలో సినిమా చెయ్యాలంటే పెట్టి పుట్టాలనే సామెత కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. 84 సంవత్సరాల వయసు గల శరవణన్‌ గారు వృద్దాప్య సమస్యలు తలెత్తడంతో ఈ రోజు చనిపోవడం జరిగింది. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆ లెజండ్రీ శిఖరానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు.

ఈ కోవలోనే రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం హోదాలో ఒక అధికార లేఖ విడుదల చేసారు. సదరు లేఖలో 'శరవణన్ గారు చనిపోయారనే విషయం తెలిసి ఎంతో చింతించాను. ఎ.వి.ఎం సంస్థ సుదీర్ఘ ప్రస్థానం కలిగిన సంస్థగా ఎదగడానికి శరవణన్ గారు ఎంతో కృషి చేశారు. విభిన్న కథాంశాలు ఎంచుకొని కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు నిర్మించే సంస్థగా పేరు సంపాదించింది. చిరంజీవి గారితో నిర్మించిన పున్నమి నాగు తరాల అంతరం లేకుండా నేటికీ ఎంతో మందిని అలరిస్తుంది. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు,లీడర్, మెరుపు కలలు, శివాజీ చిత్రాలు ప్రేక్షకులని మెప్పించాయి. ఆయన ఆత్మకి శాంతి చేకూరడంతో పాటు ఆయన కుటుంబసభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని సదరు లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు.

also read:రాజ్ విషయంలో సమంత కీలక నిర్ణయం

తమిళ,తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఎ.వి.ఎం నుంచి సుమారు 300 సినిమాల వరకు సిల్వర్ స్క్రీన్ పై మెరిసాయి. దాదాపుగా అందరి అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన ఎ.వి.ఎం 1947 లో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. చివరగా సదరు సంస్థ నుంచి వచ్చిన మూవీ 'ఈదువుమ్ కాదందు పోగుమ్. 2014 లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజవ్వగా సినీ అభిమానుల మన్ననలు అందుకుంది.